ములుగు(Mulugu) జిల్లా జంగాలపల్లి(Jangalapally) గ్రామానికి అరిష్టం పట్టింది.

ములుగు(Mulugu) జిల్లా జంగాలపల్లి(Jangalapally) గ్రామానికి అరిష్టం పట్టింది. వరుస మరణాలు(Series of death) ఆ ఊరి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రెండు నెలలలోనే 30 మంది చనిపోవడంతో ఊరికి దెయ్యం(Haunted village) పట్టిందనే జనం అనుకుంటున్నారు. జ్వరం వచ్చిన మూడు, నాలుగు రోజుల్లోనే కొందరు చనిపోతుండటంతో గ్రామంలో కలకలం రేగుతోంది. చనిపోయినవారంతా 25 నుంచి 50 ఏళ్లు ఉన్నవారే కావడంతో గ్రామస్తులు ఊరికి ఏదో జరిగిందనే భావనతో ఉన్నారు.

గ్రామానికి అరిష్టం పట్టిందని కొందరు, బొడ్రాయి వార్షికోత్సవ వేడుకలు జరపకపోవడమే కారణమని మరికొందరు అంటున్నారు. దెయ్యలు ప్రాణాలు తీస్తున్నాయని అనేవారు కూడా ఉన్నారు. జంగాలపల్లి గ్రామంలో వెంటనే మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్‌ చేస్తున్నారు. ఊళ్లో ఎవరికైనా జ్వరం వచ్చిందంటే చాలు ఇక వారు చావుకు దగ్గరైనట్టేనని అనుకుంటున్నారు. ఇరుగు పొరుగు గ్రామాల వారు జంగాలపల్లికి వెళ్లడానికి భయపడుతున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story