✕
చైనా మాంజ పట్టిస్తే 5 వేలు గిఫ్ట్ ఇస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు.

x
చైనా మాంజ పట్టిస్తే 5 వేలు గిఫ్ట్ ఇస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Danam Nagender) ప్రకటించారు. చైనా మాంజ కారణంగా మనుషులతో పాటు పక్షులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయని దానం అన్నారు. ఖైరతాబాద్ (Khairatabad)నియోజకవర్గంలో ఎవరైన చైనా మాంజ(Chinese Manja)ను విక్రయిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. ఏ షాపులో అయిన చైనా మాంజ అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే , విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని... వారికి తాను 5 వేల నగదు బహుమతిగా ఇస్తానని దానం నాగేందర్ ప్రకటించారు.

ehatv
Next Story

