వికారాబాద్ జిల్లా తాండూర్(Tandoor) మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 8 నెలల గర్భిణీ మృతి చెందింది.

వికారాబాద్ జిల్లా తాండూర్(Tandoor) మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 8 నెలల గర్భిణీ మృతి చెందింది. పెద్దేముల్ మండలం పాషాపూర్ తండా సుమిత్రా బాయి(Sumitra Bai) జైసింగ్ మృతి చెందింది. ఆలస్యంగా చికిత్స అందించడం కారణంగానే మృతి చెందిందని బంధువుల ఆరోపిస్తున్నారు. నొప్పులతో ఉదయం 5 గంటలకు వచ్చినా వైద్యులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. 9 గంటలకు స్టాఫ్ నర్స్ చికిత్స అందించిందని.. దీంతో అపారమరస్థితిలోకి వెళ్లిపోయిన గర్భిణీ సుమిత్రా బాయి. ఆలస్యంగా చికిత్స అందించినందుకే మృతి చెందిందని బంధువులు ఆందోళన. జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో ఎమర్జెన్సీగా వచ్చిన అన్ని కేసులు ఇలాగే వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు

Updated On
ehatv

ehatv

Next Story