తన కొడుకు పుట్టుక నుంచే నడువలేడు..కింద కూర్చోలేడు.. 30 ఏళ్ల వయసు వచ్చినా చిన్న బాబుకు చేసిన సేవలు చేయాలన్నారు.

తన కొడుకు పుట్టుక నుంచే నడువలేడు..కింద కూర్చోలేడు.. 30 ఏళ్ల వయసు వచ్చినా చిన్న బాబుకు చేసిన సేవలు చేయాలన్నారు. తనకు వచ్చే పెన్షన్ డైపర్లకు కూడా సరిపోవడం లేదు. కూలికి పోతేనే కుటుంబం గడిచేది. కిరాయి ఇంటికి జీరో కరెంటు బిల్లు రావడం లేదు. ఇందిరమ్మ ఇల్లుమంజూరు కాలేదు. ఏ ఆసరా లేదు. కొడుకు బాధ చూడలేక పోతన్నా చాలా కష్టం అవుతుంది. ఆదుకోండి.. లేదంటే కొడుకును చంపండని ఓ తల్లి కడుపు పగిలేలా ఏడ్వడం కనిపించింది. జనగామ(Jangaon)లోని 21వ వార్డు కురుమవాడ(kumarawada)కు చెందిన పర్శ మల్లయ్య-లక్ష్మి దంపతులకు కుమారుడు సాయి(Sai), కూతురు ఉన్నారు. కొడుకు వయసు ప్రస్తుతం 30 సంవత్సరాలు. పుట్టుకతోనే కాళ్లు, చేతులు చచ్చుబడి పోయి కనీసం కూర్చోలేని పరిస్థితి. తండ్రి ఎంసీహెచ్(MCH)లో వాటర్‌మెన్‌గా.. తల్లి సాయిబాబా ఆలయంలో కూలి చేస్తూ పిల్లలను పోషించుకుంటున్నారు. ఇద్దరూ పనికి వెళితేనే కుటుంబం గడిచేది. భార్యాభర్తలు ఇద్దరూ పనులకు పోతే కొడుకుని ఇంట్లో ఉంచి వెళ్లాల్సిందే. ప్రభుత్వం నుంచి వచ్చే దివ్యాంగుల పింఛన్ రూ.4వేలు అతని సైతం సరిపోవడం లేదు. మందులు, నెలవారి వైద్య ఖర్చులకు అప్పులు చేస్తున్నారు. అద్దె ఇంట్లో కాలం గడుపుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే జీరో కరెంటు బిల్లుకు దరఖాస్తు చేసినా వస్తలేదు. ఇందిరమ్మ ఇల్లు (Indiramma housing)కోసం దరఖాస్తు పెట్టినా మంజూరు కాలేదని వాపోయారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు మల్లయ్య(Mallaiah) తన కొడుకును భుజాన ఎత్తుకొని వచ్చారు. 'మేము ప్రభుత్వ పథకాలకు అర్హులం కాదా.. మంజూరు చేయకుంటే నా కొడుకును చంపేయండి'అంటూ కొడుకు సాయిని అక్కడే పడుకోబెట్టిన తల్లి లక్ష్మి(laxmi) అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ (Rohit singh) ఎదుట బోరున విలపించింది. స్పందించిన అదనపు కలెక్టర్ ఆ అధికారులను పిలిచి ఆ తల్లి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
