పుష్ప-2 బెన్‌ఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి మహిళ రేవతి చనిపోయిన సంగతి తెల్సిందే.

పుష్ప-2 బెన్‌ఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి మహిళ రేవతి చనిపోయిన సంగతి తెల్సిందే. రేవతి(Revathi), మొగడంపల్లి భాస్కర్ (mogadampallibhaskar)దంపతుల కుమారుడు శ్రీతేజ్(SriTej), 9, మూడు సంవత్సరాల క్రితం 'పుష్ప: ది రైజ్' చూసి నటుడు అల్లు అర్జున్‌కి అభిమానిగా మారాడు. ఇరుగుపొరుగు వారు అతనికి 'పుష్ప' అని ముద్దుగా పేరు పెట్టారు. 2021లో విడుదలైన 'పుష్ప' చిత్రానికి సీక్వెల్‌గా విడుదలైన పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఆమె మరణించింది. ఈ తొక్కిసలాటలో శ్రీతేజ్ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుండగా, అతని తల్లి మృతదేహం మార్చురీలో ఉంది. ఏం చేయాలో తోచక భర్త భాస్కర్ వెక్కివెక్కి ఏడ్వడం కలిచివేసింది. 2023లో భాస్కర్‌కు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం పడింది. దీంతో తన భర్తకు తానే లివర్‌ను దానం చేసింది రేవతి. రేవతి నాకు నాకు జీవితాన్ని ఇచ్చింది, ఇప్పుడు ఆమె పోయిందని భాస్కర్ కంటనీరు పెట్టుకున్నాడు. పిల్లలు పుష్ప-2 కోసం ఒత్తిడి చేసినందునే వెళ్లారని భాస్కర్ అంటున్నారు. తొక్కిసలాట జరిగినప్పుడు శ్రీతేజ్‌తో పాటు రేవతి కూడా ఉంది. తన కొడుకును కాపాడుకునేందుకు రేవతి చాలా ప్రయత్నించిందని కొడుకును కాపాడుకునే క్రమంలో తన ప్రాణాలు పోయాయని భాస్కర్ రోదిస్తున్నాడు.గురువారం తెల్లవారుజామున 2.30 గంటల వరకు రేవతి గురించి తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. పోలీసులు తనకు ఈ వార్త చెప్పడంతో ఒక్కసారిగా నా ప్రపంచం కూలిపోయిందన్నాడు భాస్కర్.


