Social Media Post viral: బస్సులో తనను ఓ వ్యక్తి అసభ్యంగా తాకాడని సోషల్‌ మీడియాలో మహిళ పోస్ట్.. అది చూసి తట్టుకోలేక..!

తనను బస్సులో అసభ్యంగా తాకాడంటూ సోషల్‌మీడియాలో వీడియో ఓ మహళ పోస్ట్ చేసింది. ఈ వైరల్ కావడంతో మనోవేదనకు గురైన ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..! కోజికోడ్‌ జిల్లా గోవిందపురం గ్రామానికి చెందిన దీపక్ (42) జనవరి 16వ తేదీనఆర్టీసీ బస్సులో వెళ్తున్నాడు. అదే సమయంలో తనతో, మరో మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని శిమ్జిత అనే మహిళ ఆరోపిస్తూ ఓ వీడియో తీసి తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో షేర్‌ చేసింది. రద్దీగా ఉన్న బస్సులో మహిళ శరీరాన్ని దీపక్ మోచేతితో తాకినట్లుగా ఆ వీడియోలో కనపడగా ఈ వీడియో కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఏకంగా 20 లక్షలకు మంది ఈ వీడియోను చూశారు.

ఇలా మహిళను అసభ్యంగా తాకాడంటూ వీడియో వైరల్ కావడంతో.. అది చూసిన దీపక్ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు అతనికి ధైర్యం చెప్పారు. అయినప్పటికీ తన పరువు పోయిందని భావించిన దీపక్ తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో దీపక్‌ను నిద్రలేపేందుకు ప్రయత్నించగా.. ఎంతసేపటికీ డోర్ తీయలేదు. దీంతో బలంగా డోర్‌ను పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా దీపక్ విగతజీవిగా కనిపించాడు. దీంతో శమ్జిత పెట్టిన వీడియో కారణంగానే దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబసభ్యులు, సన్నిహితులు ఫిర్యాదు చేశారు. ఆవీడియో కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నాడని దీపక్ స్నేహితులు వాపోయారు. దీంతో నెటిజన్లు కూడా దీపక్‌కు సపోర్టు చేస్తున్నారు. బస్సులో రద్దీ కారణంగా అనుకోకుండా అతని మోచేతి ఆమెకు తగిలిందని.. ఉద్దేశపూర్వకంగా మాత్రం కాదని అభిప్రాయపడుతున్నారు. అయితే శమ్జిత మాత్రం ఆ వ్యాఖ్యలను ఖండించారు. దీపక్ ఉద్దేశపూర్వకంగానే తాకాడని స్పష్టం చేశారు. “పయ్యనూర్‌కు వెళ్తున్న సమయంలో బస్సులో ఓ మహిళ అసౌకర్యంగా ఫీలవ్వడం గమనించారు. ఓ వ్యక్తి ఆమె వెనుక చాలా దగ్గరగా నిల్చొని ఉన్నాడు. అది గమనించి నేను సెల్ఫీ వీడియో తీశా. అది గమనించి చాలాసేపు అతను సైలెంట్‌గా ఉన్నాడు. తర్వాత బస్సులో రద్దీ పెరగానే.. అతను మళ్లీ నా దగ్గరగా వచ్చాడు. అప్పుడు మళ్లీ వీడియో తీశా. ఆ రెండింటినీ కలిపి సోషల్‌మీడియాలో పోస్టు చేశా.” అని తెలిపారు. అయితే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడని ఊహించలేదని చెప్పారు.

Updated On
ehatv

ehatv

Next Story