తప్పుడు సర్వే నెంబర్లతో ప్రభుత్వ భూములను ప్రైవేటుకు కట్టబెట్టి రూ.100 కోట్ల ఆస్తులు దండుకున్న రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ.

తప్పుడు సర్వే నెంబర్లతో ప్రభుత్వ భూములను ప్రైవేటుకు కట్టబెట్టి రూ.100 కోట్ల ఆస్తులు దండుకున్న రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ. మై హోమ్ భూజలో ఫ్లాట్, నారాయపేటలో రైస్ మిల్, అనంతపురంలో 11 ఎకరాలు, కర్ణాటకలో 11 ఎకరాల భూములను గుర్తించిన ఏసీబీ అధికారులు. రంగారెడ్డి జిల్లాలో సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కొత్తమ్ శ్రీనివాసులు అనే వ్యక్తి, సంపాదనకు మించిన ఆస్తులు కూడబెట్టాడని ఫిర్యాదు అందుకున్న ఏసీబీ. దీంతో తన మై హోమ్ భూజ నివాసంతో పాటు అతని స్నేహితులు, బినామీల నివాసాలు, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని అతని కార్యాలయంలో విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు శ్రీనివాసులుకు మై హోమ్ భూజలో విలాసవంతమైన ఫ్లాట్, అనంతపురంలో 11 ఎకరాల భూమి, కర్ణాటకలో 11 ఎకరాల భూమి, మహబూబ్‌నగర్ జిల్లాలో 4 ప్లాట్లు, నారాయణపేటలో ఒక రైస్ మిల్, 4 ప్లాట్లు ఉన్నట్లు గుర్తింపు, తన ఇంట్లో సోదాలు చేస్తుండగా 1.6 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదు, 770 గ్రాముల వెండి లభించినట్లు అధికారుల వెల్లడి. గతంలో శ్రీనివాసులు మీద ఏసీబీ కేసు నమోదు అవ్వడంతో కొంత కాలం సస్పెన్షన్‌లో ఉండి తిరిగి విధుల్లో చేరారని, అయినా తన పద్ధతి మార్చుకోలేదని తెలిపిన ఏసీబీ అధికారులు


