హైడ్రా(Hydra) అధికారుల నోటీసులపై సినీ నటుడు, జయభేరి(Jayaberi convention) అధినేత మురళీమోహన్‌(Murali mohan) రియాక్టయ్యారు.

హైడ్రా(Hydra) అధికారుల నోటీసులపై సినీ నటుడు, జయభేరి(Jayaberi convention) అధినేత మురళీమోహన్‌(Murali mohan) రియాక్టయ్యారు. వాళ్లకు వాళ్లుగా కూల్చితే సరి, లేకుంటే మేమే కూల్చేస్తాం అని హైడ్రా కమిషనర్‌ ఎ.వి.రంగనాథ్‌(Ranganath) చేసిన వ్యాఖ్యకు మురళీమోహన్‌ సమాధానం ఇచ్చుకున్నారు. రెండు రోజుల్లో తామే తాత్కాలిక షెడ్డును తొలగిస్తామని, హైడ్రా రానవసరం లేదని మురళీమోహన్ అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...'నేను ఆక్రమణలకు పాల్పడలేదు. 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్‌ రంగంలో ఉన్నాను. ఏనాడూ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు. బఫర్ జోన్‌లో ఉంటే నేనే కూల్చేస్తాను. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా ఆధికారులు వచ్చారు. బఫర్ జోన్‌లో మూడు అడుగుల మేరకు.. రేకుల షెడ్డు ఉన్నట్టు అధికారులు గుర్తించి నోటీసులు ఇచ్చారు. ఆ రేకుల షెడ్డును మేమే తొలగించేస్తాం.. హైడ్రా రానక్కర్లేదు. రెండ్రోజుల్లో (మంగళవారం లోపు) తాత్కాలిక షెడ్డును తొలగిస్తాం’ అని స్పష్టం చేశారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువులో ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (FTL), బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణ సంస్థకు హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మురళీమోహన్ రియాక్టయ్యారు. ఇదిలా ఉంటే హైడ్రా ఆదివారం భారీగా కూల్చివేతలు జరుపుతోంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story