పుష్ప-2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌(SandhyaTheatre)లో జరిగిన తొక్కిసలాట ఘటన పై కేసు నమోదయ్యింది.

పుష్ప-2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌(SandhyaTheatre)లో జరిగిన తొక్కిసలాట ఘటన పై కేసు నమోదయ్యింది. ఈ ఘటనలో మృతి చెందిన రేవతి భర్త భాస్కర్‌ ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్‌(Allu Arjun), ఆయన సెక్యూరిటీ, థియేటర్‌ యాజమాన్యంపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రీమియర్‌ షోకు అల్లు అర్జున్‌ వస్తున్నట్టు తమకు ఎలాంటి సమాచారం లేదని డీసీపీ స్పష్టం చేశారు. మరోవైపు, ఇదే ఘటనపై అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌పై తెలంగాణ లీగల్‌సెల్‌ ఉపాధ్యక్షుడు తిరుపతివర్మ(Tirupati Varma) చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇప్పించాలని డిమాండ్‌ చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story