✕
SIT notices to KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం..! కేసీఆర్‌కు సిట్ నోటీసులు..!

x
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం జరగబోతుంది. బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా సిట్ విచారించనుంది. ఈరోజో, రేపో కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశమున్నట్లు సమాచారం. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలోనే ఆయనను విచారించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన కేసుకు సంబంధించి కాకుండా పంజాగుట్టలో నమోదైన ఫిర్యాదుకు సంబంధించి ఇప్పటికే పార్టీ పెద్దలు హరీష్ రావు.. కేటీఆర్.. సంతోష్‌రావు లను విచారించిన సిట్.. ఇదే కేసులో కేసీఆర్‌ను కూడా విచారించనున్నట్లు సమాచారం. ఈ ముగ్గురినీ సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం నోటీస్ ఇచ్చి విచారించిన నేపథ్యంలో కేసీఆర్ కూడా అదే నోటీస్ ఇస్తారా.. అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది..!

ehatv
Next Story

