సంధ్య థియేటర్‌ ఘటనపై పవన్ కల్యాణ్‌ స్పందించారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారని..

సంధ్య థియేటర్‌ ఘటనపై పవన్ కల్యాణ్‌ స్పందించారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారని.. అభిమాని మృతి చెందిన తర్వాత పరామర్శించాలని..మానవతా ధృక్పథం లోపించినట్లుందని పవన్ అన్నారు. అల్లు అర్జున్‌ కాకున్నా.. ఆ టీం అయినా సంతాపం తెలపాలన్నారు. తన పేరు మర్చిపోయాడని అరెస్ట్ చేసినట్లు చెప్పడం సరికాదని రేవంత్‌ ఆ స్థాయిని దాటిపోయిన బలమైన నేత అని పవన్‌ అన్నారు. అల్లు అర్జున్‌ స్థానంలో రేవంత్‌ ఉన్నా అరెస్ట్ చేసేవారని..చట్టం ఎవరికీ చుట్టం కాదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సినీ పరిశ్రమను రేవంత్‌ ఎంతో ప్రోత్సహించారని.. పుష్ప సినమా బెనిఫిట్‌ షో రేట్లను పెంచడం ఇందులో భాగమేనని పవన్‌ కల్యాణ్ అన్నారు.

Updated On
ehatv

ehatv

Next Story