తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌(BRS) అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు(KCR) ప్రస్తుతం కాలం కలిసిరావడం లేదు.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌(BRS) అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు(KCR) ప్రస్తుతం కాలం కలిసిరావడం లేదు. అయితే ఇలాంటి సందర్భాలను కేసీఆర్‌ తన రాజకీయ జీవితంలో ఎన్నో చూసి ఉన్నారు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడ్డారు. ఉత్థాన పతనాలను చవి చూశారు. ప్రముఖ జ్యోతిష్కుడు ప్రశాంత్‌ కిని(Astrologer prashanthkini) ఇదే మాట చెబుతూ రానున్న రోజుల్లో కేసీఆర్‌కు మహర్దశ పట్టనున్నదని చెప్పారు. ప్రస్తుతం రాహుకాలం కొనసాగుతున్న కేసీఆర్‌కు త్వరలోనే శుభ గడియలు ప్రారంభం కానున్నాయన్నారు. పరిస్థితులు కలిసివచ్చి కేసీఆర్‌కు రాజయోగం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. ఎక్స్‌లో ప్రశాంత్‌ చేసిన పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రశాంత్‌ కిని చెప్పిన జోస్యాలు చాలా మట్టుకు వాస్తవరూపం దాల్చాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story