చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బలగం మొగిలయ్య కన్ను మూశారు. ఆయన ప్రాణాలు కాపాడటంకోసం చాలా ప్రయత్నం చేశారు.

చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బలగం మొగిలయ్య కన్ను మూశారు. ఆయన ప్రాణాలు కాపాడటంకోసం చాలా ప్రయత్నం చేశారు. కాని పరిస్థితి విషమించింది.
బుర్రకథ కళాకారుడు, బలగం మూవీ ఫేమ్ మొగిలయ్య కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మరణించారు. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బలగం సినిమా గుర్తుంది కదా. ఈసినిమా ద్వారా బాగా ఫేమస్ అయిన వారిలో బలగం మొగిలయ్య కూడా ఒకరు. బలగం క్లైమాక్స్ లో తన బుర్రకథ పాటతో ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు. బందాలు బంధుత్వాలు, రక్త సంబంధాల విలువ పాట రూపంలో చెప్పి మెప్పించాడు మొగిలయ్య.
ఎన్నో ఏళ్లుగా మొగిలయ్య – తన భార్య కొమురమ్మ బుర్రకథ కళాకారులుగా.. ఊరురా తిరుగుతూ బుర్ర కథలు చెప్పుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. బలగం సినిమాతో వీరికి మంచి పేరు వచ్చింది. అయితే చాలా కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న మొగిలయ్య వరంగల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. చికిత్సకు కూడా డబ్బులు లేకపోవడంతో వారు ప్రభుత్వాన్ని, టాలీవుడ్ ను కూడా అర్ధించారు.
దాంతో గతంలో బలగం డైరెక్టర్ వేణుతో పాటు కొంత మంది టాలీవుడ్ ప్రముఖులు కూడా మొగిలయ్య ట్రీట్మెంట్ కు ఆర్ధిక సాయం చేశారు. అంతే కాదు గత ప్రభుత్వం వీరికి ఆర్ధిక సహాయం చేసారు. హాస్పిటల్ కు కూడా వచ్చి పరామర్శించారు మంత్రులు. ఇక అప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు మొగిలయ్య. పరిస్థితి విషమించడంతో నేటి ఉదయం(19 డిసెంబర్ ) కన్నుమూశారు. మెగిలయ్య మరణవార్త తెలుసుకున్న పలువురు బుర్రకథ కళాకారులు, సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.


