మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థిగా బండ్ల గణేష్ దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ..

Bandla Ganesh who applied as a parliamentary candidate from Malkajgiri
మల్కాజ్ గిరి(Malkajgiri) పార్లమెంట్ అభ్యర్థిగా బండ్ల గణేష్(Bandla Ganesh) దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం గాంధీ భవన్(Gandhi Bhavan) లో ఆయన మాట్లాడుతూ.. ఇంద్రవెళ్లి సభకోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ రెండు నెలల రేవంత్ రెడ్డి(Revanth Reddy) పరిపాలన గురించి ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందన్నారు. మతిభ్రమించి మల్లారెడ్డి(MallareddY) ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మల్లారెడ్డి విద్యార్థుల రక్తాన్ని పీల్చి పీజులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పరిపాలన చూసి కాంగ్రెస్ కార్యకర్తగా నేను గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాయితీగా తెలంగాణను పరిపాలిస్తున్నారని కొనియాడారు.
