బర్రెలక్క తనపై వస్తున్న ట్రోల్స్‌పై ఒక వీడియో విడుదల చేసింది.

బర్రెలక్క తనపై వస్తున్న ట్రోల్స్‌పై ఒక వీడియో విడుదల చేసింది. తెలంగాణ(Telangana) ఎన్నికల తర్వాత నుంచి తనపై, ముఖ్యంగా తన వివాహం గురించి ట్రోల్స్ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. బర్రెలక్క (Barrelakka)తన సొంతూరులో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభించింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, నిరుద్యోగ సమస్యలపై పోరాడతానని చెప్పిన ఆమె, ఇప్పుడు వ్లాగ్స్ చేస్తూ బిజీగా ఉండడంపై కొంతమంది ప్రశ్నిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ (BRS)ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపిస్తూ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క, ప్రస్తుతం గ్రూప్-1 పరీక్షలు, జీవో 29 రద్దు విషయంలో సోషల్ మీడియా రీల్స్ చేస్తోంది. 2024 మార్చి 28న బర్రెలక్క వివాహం చేసుకుని, నాగర్‌కర్నూల్‌లో సెటిల్ అయింది. ఆమె పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై బర్రెలక్క భావోద్వేగంతో స్పందిస్తూ, తన పేరుతో ఫేక్ అకౌంట్స్ ఉన్నాయని, తాను ఎలాంటి తప్పు చేయలేదని వీడియోలో చెప్పింది. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్(Social Media Trolls ) కొనసాగుతున్నాయని, తన వివాహం గురించి కూడా అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె కంటతడి పెట్టుకుంది. "పెళ్లి చేసుకోవడం తప్పా?" అని ఆమె ట్రోలర్స్‌ను ప్రశ్నించింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని, సామాన్య జీవితం గడపాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. తన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకొని ట్రోల్స్ చేయడం తనను బాధిస్తోందని, ఇలాంటి వ్యాఖ్యలు మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయని ఆమె తెలిపింది.

ehatv

ehatv

Next Story