రేపు ఉదయం 11:00 గంటలకు డా బీ ఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అట్టహాసంగా భూమి పూజ జరగనుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు

రేపు ఉదయం 11:00 గంటలకు డా బీ ఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అట్టహాసంగా భూమి పూజ జరగనుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారని పేర్కొన్నారు.

ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి సెక్రటేరియట్‌లో చూసిన ప్రదేశంలోనే ఈ విగ్రహావిష్కరణ జరగనుందని వెల్ల‌డించారు. ఈ సంవత్సరం డిసెంబర్ 9 తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని.. ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభం ఉండనుందని తెలిపారు.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story