బిత్తిరి సత్తి సారీ చెప్పాడు

భగవద్గీతను(Bhagavadgita) కించపరిచేలా వీడియో చేశాడంటూ బిత్తిరి సత్తి(Bitiri sathi) అలియాస్‌ రవికుమార్‌(ravikumar) కావలిపై సైబర్‌ క్రైమ్‌లో వానరసేన(Vanarasena) కంప్లయింట్‌ చేసిన విషయం తెలిసిందే కదా! దీనిపై ఇప్పటి వరకు బెట్టు చేసిన బిత్తిరి సత్తి ఇప్పుడు సారీ(sorry) చెప్పాడు. 'నేను సరదాగా చేసిన వీడియో అది. కానీ, కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరినీ కించపరచాలని కాదు. చిన్న అక్ష‌ర‌దోషం వ‌ల‌న అలా జ‌రిగింది. ఎవరైనా బాధపడితే క్షమాపణలు చెబుతున్నా' అని బిత్తిరి సత్తి చెప్పుకొచ్చాడు. ఈ మేర‌కు ప్ర‌త్యేకంగా ఓ వీడియో విడుద‌ల చేశాడు. తాను కూడా భ‌గ‌వ‌ద్గీతను ఆరాధిస్తాన‌ని, చ‌దువుతాన‌ని తెలిపారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story