జన్వాడలోని రాజ్‌ పాకాల ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్‌ పార్టీపై కేంద్రమంత్రి బండి సంజయ్‌(Bandi sanjay) స్పందించారు.

జన్వాడలోని రాజ్‌ పాకాల ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్‌ పార్టీపై కేంద్రమంత్రి బండి సంజయ్‌(Bandi sanjay) స్పందించారు. నిజంగా కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రేవ్‌ పార్టీపై(Rave party) సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఫామ్‌హౌస్‌(Farm house) సీసీ టీవీ ఫుటేజ్‌తో పాటు మిగతా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలన్నారు. కేటీఆర్‌(KTR) బావ మరిది రాజ్‌ పాకాల(Raj pakala) డ్రగ్స్‌ పార్టీ(drugs party) నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. .‘సుద్దపూస.. ఇప్పుడేమంటాడో. బావ మరది ఫామ్‌ హౌస్‌లోనే రేవ్ పార్టీలా?. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో. ‘సుద్దపూస’ను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నాయి. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్‌పై రాజీ ధోరణి ఎందుకని సంజయ్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్(BRS) కాంప్రమైజ్ పొలిటిక్స్‌ సిగ్గు చేటన్నారు. బడా నేతలతో సహా రేవ్ పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story