Bandi Sanjay : బీజేపీ ఎంపీలు ఓడిపోయారు...కాంగ్రెస్ ఎంపీలు గెలిచారు
అసెంబ్లీలో(Asembly) అడుగుపెడదామనుకుని ఆశపడిన ముగ్గురు బీజేపీ(BJP) ఎంపీలకు నిరాశే ఎదురయ్యింది. అదే సమయంలో ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు ఘన విజయాలు సాధించి సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. నిజామాబాద్(Nizamabad) ఎంపీ ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind) ఈ ఎన్నికల్లో జగిత్యాల(Jagityala) జిల్లా కోరుట్ల(Korutla) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ బీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్(Dr.Sanjay Kumar) చేతిలో ఓటమిపాలయ్యారు.

Bandi Sanjay
అసెంబ్లీలో(Asembly) అడుగుపెడదామనుకుని ఆశపడిన ముగ్గురు బీజేపీ(BJP) ఎంపీలకు నిరాశే ఎదురయ్యింది. అదే సమయంలో ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు ఘన విజయాలు సాధించి సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. నిజామాబాద్(Nizamabad) ఎంపీ ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind) ఈ ఎన్నికల్లో జగిత్యాల(Jagityala) జిల్లా కోరుట్ల(Korutla) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ బీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్(Dr.Sanjay Kumar) చేతిలో ఓటమిపాలయ్యారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు(Bandi Sanjay) కూడా ఇదే పరిస్థితి. కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన బండి సంజయ్‌ను బీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్(Gangula Kamalakar) ఓడించారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఈ ఎన్నికల్లో బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ముగ్గురు ఎంపీలో అసెంబ్లీ బరిలో దిగారు. మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి(Revanth Reddy) కొడంగల్ శాసనసభ నుంచి విజయం సాధించారు. భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ శాసనసభ్యుడిగా భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక నల్లగొండ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ శాసనసభ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీలో ముగ్గురు ఎంపీలు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోతే, ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు మాత్రం ఎమ్మెల్యేలయ్యారు.
