రూ.20 కోట్ల బంగారం డిపాజిట్ కేసులో ఇద్దరు సీనియర్ తెలంగాణ బీజేపీ నాయకులపై కేసు నమోదు చేశారు పోలీసులు.

రూ.20 కోట్ల బంగారం డిపాజిట్ కేసులో ఇద్దరు సీనియర్ తెలంగాణ బీజేపీ నాయకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఉప్పల్‌లోని సిరి గోల్డ్ మర్చంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోసంపూడి రవీంద్ర, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు. పెట్టుబడిదారుల నుండి సుమారు రూ. 20 కోట్లు వసూలు చేసి మోసం చేసిన సిరి గోల్డ్ మర్చంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. పెట్టుబడి పెడితే రోజువారీ లాభాలు చూపిస్తామని నమ్మించి వేలాది మందితో పెట్టుబడులు పెట్టించిన ప్రమోటర్లు. చెప్పినట్లుగా లాభాలు ఇవ్వకుండా, పెట్టుబడులను తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని సంస్థపై ఫిర్యాదు చేసిన బాధితులు. BNS సెక్షన్ 316(2) మరియు 318(4) కింద కేసు నమోదు చేశారు, BNS సెక్షన్ 3(5) కింద సీనియర్ బీజేపీ నేతలు కోసంపూడి రవీంద్ర, నెల్లూరు కోటేశ్వరరావుతో పాటు సంస్థ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన CCS పోలీసులు

Updated On
ehatv

ehatv

Next Story