BJP MLA Palvai Harish has faced a big problem.. Please change the name of "Lanjaguda"...!

ఎమ్మెల్యే అంటే నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉంటాయి. ప్రతీ రోజు ప్రజలు వచ్చి తమ సమస్యలు వచ్చి చెప్పుకుంటారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పడు సాధ్యమైనన్ని సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఓ ఎమ్మెల్యేకు అనుకోని సమస్య ఎదురైంది. ఎప్పుడూ లేని పెద్ద చిక్కే వచ్చింది. ఆ సమస్య పరిష్కారం కోసం ఆయన అసెంబ్లీని వేదికగా చేసుకున్నారు. తన నియోజకవర్గంలోని ఓ ఊరు పేరును మార్చాలని ఏకంగా అసెంబ్లీలో ప్రతిపాదించారు. ఆ ఊరు పేరు అభ్యంతరకరంగా ఉండడంతో దానిని మార్చాలని, రెవెన్యూ రికార్డుల్లో ఆ పేరును తీసేయాలని కోరాడు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు సిర్పూర్ నియోజకవర్గం కాగజ్‌నగర్ సమీపంలోని "ల*జగూడ" అనే గ్రామం పేరును మార్చాలని ప్రతిపాదించారు. గ్రామస్తులు ఇప్పటికే తమ గ్రామం పేరును "నందిగూడ"గా మార్చుకున్నారు. రెవెన్యూ రికార్డుల్లో కూడా ఈ మార్పును అమలు చేయాలని ఆయన కోరారు. దీంతో ఈ అంశం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది.

Updated On 3 Jan 2026 12:05 PM GMT
ehatv

ehatv

Next Story