అత్యాచార కేసులో చిక్కుకున్న టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌(Choreographer Jani Master)పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌(BJP MLA Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు.

అత్యాచార కేసులో చిక్కుకున్న టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌(Choreographer Jani Master)పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌(BJP MLA Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్‌కు దొంగలకు ఇచ్చే ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలని, సినిమా ఇండస్ట్రీ నుంచి అతడిని బహిష్కరించాలని రాజాసింగ్‌ అన్నారు. మతం మార్చుకోవాలని బాధితురాలిని జానీ మాస్టర్‌ హింసించాడని రాజాసింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జానీ కేసులో వాస్త‌వాల్ని బ‌య‌ట పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఇప్పుడు బాధితురాలు ధైర్యంగా బయటకు వచ్చి జానీపై కంప్లయింట్‌ ఇచ్చింది కానీ, ఇంకెంత మంది భయపడి గమ్మున ఉండిపోయారోనని రాజాసింగ్‌ సందేహం వ్యక్తపరిచారు. ఎంత మందిని మతం మార్చుకోవాలని బలవంతం చేశాడో వాటన్నింటినీ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story