బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ(BJP)లో దొంగలంతా ఒకటయ్యారు.. నన్ను సస్పెండ్ చేస్తే అందరి బాగోతాలు బయటపెడతా

బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ(BJP)లో దొంగలంతా ఒకటయ్యారు.. నన్ను సస్పెండ్ చేస్తే అందరి బాగోతాలు బయటపెడతా అంటూ రాజసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజసింగ్ (Raja Singh)పట్ల క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అతనికి నోటీసులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించుకుందని ప్రచారం జరుగుతున్న సమయంలో తీవ్ర విమర్శలు చేసిన రాజాసింగ్. నోటీసులు ఇవ్వడం కాదు దమ్ముంటే పార్టీ నుండి సస్పెండ్ చేయండి, అప్పుడు ఎవరు పార్టీకి నష్టం చేస్తున్నారో బయటపెడతా అంటూ వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్. ఇంటి దొంగలంతా ఒకటై బీజేపీని బీఆర్ఎస్(BRS) నాయకులకు తాకట్టు పెడుతున్నారని, కొంచెం ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే పార్టీని బీఆర్ఎస్‌కు తాకట్టు పెడతారని రాజాసింగ్ ఆరోపించారు.

Updated On
ehatv

ehatv

Next Story