తెలంగాణ బీజేపీలో(Telangana, BJP) వర్గ పోరు(class difference) నడుస్తోందని ఎంపీ అర్వింద్‌(MP Arvind) వ్యాఖ్యలతో మరోసారి తేలింది

తెలంగాణ బీజేపీలో(Telangana, BJP) వర్గ పోరు(class difference) నడుస్తోందని ఎంపీ అర్వింద్‌(MP Arvind) వ్యాఖ్యలతో మరోసారి తేలింది. వర్గపోరుతోనే బీజేపీ అధికారంలోకి రాలేకపోయిందన్న అర్వింద్‌ వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహం కూల్చిన ఘటనపై అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ అధికారంలో ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అని వ్యాఖ్యానించారు. మా పార్టీ అధికారంలో ఉంటే ఎవరిని చెప్పు కింద తొక్కి పెట్టాలో అక్కడ పెడతామన్నారు. అయినా పార్టీ ఈ పరిస్థితికి రావడానికి కారణమెవరని అన్నారు. జీహెచ్‌ఎంసీలో 48 స్థానాలు గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఒక్కటే గెలవడం ఏంటని ప్రశ్నించారు. లోకసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు వేయడం లేదో ఆలోచించుకోవాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వం వస్తుందనుకున్న సమయంలో 8 సీట్లకు ఎందుకు పరిమితమయ్యామో సమీక్షించుకోవాలన్నారు. బీజేపీ ఈ పరిస్థితికి కారణం మేమే అని వ్యాఖ్యానించారు. పరోక్షంగా బీజేపీ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేసినట్లు అర్వింద్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది

Updated On
Eha Tv

Eha Tv

Next Story