జన్వాడ ఫామ్‌హౌజ్‌లో(Janwada farmhouse) జరిగిన రేవ్‌పార్టీపై(Raveparty) బీజేపీ(BJP) ఎంపీ రఘునందనరావు(Raghunandhan rao) సంచలన ఆరోపణలు చేశారు.

జన్వాడ ఫామ్‌హౌజ్‌లో(Janwada farmhouse) జరిగిన రేవ్‌పార్టీపై(Raveparty) బీజేపీ(BJP) ఎంపీ రఘునందనరావు(Raghunandhan rao) సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌(Congress), బీఆర్‌ఎస్‌(BRS) కుమ్మక్కయ్యాయని అనుమానం కలుగుతోందన్నారు రఘునందనరావు. రేవ్‌పార్టీలో వీఐపీల పిల్లలు ఉన్నారని వార్తలొచ్చాయని, ఇప్పుడేమో పేర్లు బయటపెట్టడానికి ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. ఫామ్‌హౌస్‌ చుట్టూ ఉన్న సీస ఫుటేజ్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌ దందా జరుగుతోందని ఆరోపించారు. జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఏం జరిగిందో ప్రజలకు తెలియాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై వెంటనే సిట్‌ను(SIT) ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story