సీఎం కూడా తన జన్మదినం సందర్బంగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా రాజకీయనాకులు, సినీరంగానికి చెందినవారు, ఇతర ప్రముఖులంతా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కూడా తన జన్మదినం సందర్బంగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మూసీ(Musi) పునరుజ్జీవయాత్ర కూడా చేపట్టారు. అయితే ఈ సందర్భంగా బండ్ల గణేష్ సినీ ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) జన్మదినం సందర్భంగా ఇండస్ట్రీ నుంచి శుభాకాంక్షలు తెలిపినవారందరికీ కృతజ్ఞతలు అని ఆయన ఎక్స్‌ వేదికగా ట్వీట్ చేశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియని పెద్దలకు కూడా ఓ నమస్కారమంటూ వ్యంగ్యాస్త్రం వదిలారు. అంతేకాకుండా సినీ పెద్దలకు టికెట్ రేట్లు పెంచుకోవాలనుకున్నప్పడే సీఎం కావలెను అంటూ సుతిమెత్తని విమర్శ చేశారు. దీంతో బండ్ల గణేష్‌ ట్వీట్‌ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Updated On
ehatv

ehatv

Next Story