యువతిని మోసం చేసి బాబు పుట్టాక ముఖం చాటేసిన యువకుడిపై మధురానగర్‌ పీఎస్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

యువతిని మోసం చేసి బాబు పుట్టాక ముఖం చాటేసిన యువకుడిపై మధురానగర్‌ పీఎస్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. పోలీసులు తెలిపిన మేరకు..రంగారెడ్డి జిల్లాకు చెందిన యువతి షాద్‌నగర్‌ కాలేజీలో డిగ్రీ చదివే సమయంలో సీనియర్‌ ద్వారా భరత్‌రెడ్డి (Bharath Reddy)పరిచయమయ్యాడు. గత ఏడాది యువతిని అమీర్‌పేట (Ameerpeta)ఓయో రూంలో బలవంతంగా కలిశాడు.గర్భవతినని ఆమె భరత్‌రెడ్డికి చెప్పగా పెళ్ళి చేసుకుందామని చెప్పాడు.ఆ తరువాత ఆమెకు బాబు పుట్టాడు. దీంతో బాధితురాలు షాద్‌నగర్‌లోని భరత్‌రెడ్డి ఇంటికి వెళ్లి నిలదీసింది. దీంతో ఆమెపై దుర్బాషలాడి పంపించారు. తనను మోసం చేసిన భరత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మధురానగర్‌ పీఎస్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఎస్‌ఆర్‌నగర్‌కు పంపారు.

ehatv

ehatv

Next Story