మనకు మంచి రోజులు ముందున్నాయి..

కేసీఆర్‌ను(KCR) కలిసేందుకు ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Congress MLA) ప్రయత్నించారని.. కానీ కేసీఆర్‌ వారిని కలవాల్సిన అవసరం లేదన్న వార్త సోషల్‌ మీడియాలో(Social Media) వైరలవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పటికే వచ్చిన వ్యతిరేకతను గుర్తించిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నాలు చేయగా కేసీఆర్ సున్నితంగా తిరస్కరించినట్లు పయనీర్‌ పత్రికా కథనంలో వచ్చింది. మనకు మంచి రోజులు ముందున్నాయి.. ఓపికపట్టి పనిచేసుకుంటూపోతే ప్రజలే నెత్తిన పెట్టుకొని మనల్ని గెలిపిస్తారని పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేసిన కేసీఆర్. కొత్త ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలని ఓపికగా ఉంటున్నామని కేసీఆర్‌ వారితో అన్నారట. కానీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మాత్రం ఈ పార్టీలో ఉంటే తమకు భవిష్యత్‌ ఉండదని.. బీఆర్‌ఎస్‌లో తమని అకామిడేట్‌ చేయాలని కోరారట. అయితే దీనిని కేసీఆర్‌ అంగీకరించలేదట. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని దీంతో తమకు అక్కడ భవిష్యత్‌ లేదని తెలిపారట. రుణమాఫీతో సహా అన్ని హామీలు, పరిపాలనపై కాంగ్రెస్‌ పట్టుకోల్పోయిందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారని సమాచారం.

Updated On
Eha Tv

Eha Tv

Next Story