ఎంతోమంది విద్యార్థులకు ఉన్నతమైన విలువలతో కూడిన విద్యాబుద్ధులు నేర్పించిన గొప్ప విద్యాదాత సత్తార్ సార్(Sattaar Sir) అని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర రెడ్డి కొనియాడారు.

ఎంతోమంది విద్యార్థులకు ఉన్నతమైన విలువలతో కూడిన విద్యాబుద్ధులు నేర్పించిన గొప్ప విద్యాదాత సత్తార్ సార్(Sattaar Sir) అని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర రెడ్డి కొనియాడారు. ఆదివారం సూర్యపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆడిటోరియంలో జరిగిన సత్తార్ సార్ సంతాపసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సత్తార్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. . సత్తార్ సార్ దగ్గర తాను చదువుకున్నది కొంతకాలమే అయినప్పటికీ ఆయనుంచి ఎంతో నేర్చుకున్నానన్నారు. ఆయన దగ్గర విద్యానభ్యసించిన వారు అన్నిరంగాల్లో ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారన్నారు. సత్తార్ సార్ కు లెక్కలు చెప్పడం తప్ప తన జీవితంలో లెక్కలేసుకోలేదన్నారు. అందుకే ఆయన చివరి శ్వాస వరకు సాధారణ జీవితమే గడిపారన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story