బీఆర్‌ఎస్‌(BRS) నుంచి మరో ఎమ్మెల్యే కాంగ్రెస్‌(congress) పార్టీలోకి జంప్‌ అయ్యారు.

బీఆర్‌ఎస్‌(BRS) నుంచి మరో ఎమ్మెల్యే కాంగ్రెస్‌(congress) పార్టీలోకి జంప్‌ అయ్యారు. పొద్దున్నే బాన్సువాడ(Bansuwada) ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి(srinivas reddy) ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy), మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti srinivas reddy) వెళ్లారు. అప్పుడే పోచారం కాంగ్రెస్‌లో చేరతారనేది కన్‌ఫామ్‌ అయ్యింది. పోచారంతో పాటుగా ఆయన కుమారుడు భాస్కర్‌రెడ్డి(Bhaskar reddy) కాంగ్రెస్‌లో చేరారు. కండువా వేసి పార్టీలోకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. తెలగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాసరెడ్డిని కలిశామని, పెద్దలుగా అండగా నిలబడాలని వారిని కోరామని రేవంత్‌ చెప్పుకొచ్చారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసమే పోచారం కాంగ్రెస్‌లో చేరారని సీఎం అన్నారు. రైతుల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళతామన్నారు. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న పోచారం రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కొనసాగినా సొంత చరిష్మాతో బాన్సువాడ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story