మ‌హిళ‌ల ఉచిత బ‌స్సు(women free bus travel) ప్ర‌యాణాల‌పై కేటీఆర్‌(KTR) చేసిన వ్యాఖ్య‌లు కొంచెం వివాదాస్పదమయ్యాయి.

మ‌హిళ‌ల ఉచిత బ‌స్సు(women free bus travel) ప్ర‌యాణాల‌పై కేటీఆర్‌(KTR) చేసిన వ్యాఖ్య‌లు కొంచెం వివాదాస్పదమయ్యాయి. మంత్రి సీతక్కతో(Minister Sitakka) పాటు మహిళా కాంగ్రెస్‌(congress) నాయకురాళ్లు కూడా గయ్యిమన్నారు. దీంతో కేటీఆర్‌(KTR) ఎక్స్‌ వేదికగా వివరణ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యల వల్ల మహిళలకు మనస్తాపం కలిగితే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. పార్టీ భేటీలో య‌థాలాపంగా చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల విచారం వ్య‌క్తం చేస్తున్నాను. అక్క‌చెల్లెమ్మ‌ల‌ను కించ‌ప‌రిచే ఉద్దేశం తనకు ఎప్ప‌డూ లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story