రేవంత్‌రెడ్డి(Revanth reddy), ఆయన కుటుంబంపై కేటీఆర్‌(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్‌రెడ్డి(Revanth reddy), ఆయన కుటుంబంపై కేటీఆర్‌(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. అయ్యప్ప సొసైటీని అన్న పంచుకుంటే, కొండలు, గుట్టలను కొండల్‌రెడ్డి(Kondal reddy) పంచుకున్నాడని విమర్శించారు. అయ్యప్ప సొసైటీలో(Ayyappa Society) 500 గజాల్లో ఒక స్లాబ్‌ వేసుకుంటే రూ.8 లక్షల గుంజుతున్నరని, రెండో స్లాబ్‌కు రూ.18 లక్షలు గుంజుతున్నారన్న విషయం ఎమ్మెల్యే గాంధీనే తనతో చెప్పారని కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదళ్ల గూడు కూల్చుతున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు. నాలాలు, చెరువుల కంపు పీల్చుకుంటూ పేదలే ఉంటారని, అలాంటి వారి ఇళ్లను కూలగొట్టి వారి పొట్టగొడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయమా? గరీబోళ్లకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్ లో అక్రమంగా పర్మిషన్ ఇచ్చిందే మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని విమర్శించారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు కూలగొట్టడమేందని అన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబం రాష్ట్రాన్ని పంచుకొని స్వైర విహారం చేస్తూ దోచుకుంటున్నారు. నాగార్జునకు(Nagarjuna) సంబంధించిన నిర్మాణాన్ని కూల్చేశారు మంచిదే. కానీ పర్మిషన్ ఇచ్చిందెవరని మండిపడ్డారు. అనుమతులు ఇచ్చినవారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story