జిట్టా మరణం పట్ల కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

తెలంగాణ ఉద్యమకారుడు(Telangana activist), బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ సీనియర్‌ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి(jitta balakrishna reddy) మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌(BRS) అధినేత కేసీఆర్‌(KCR) సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన పోరాటంలో జిట్టా బాలకృష్ణ రెడ్డి క్రియాశీలకంగా పాల్గొన్నారని వారి కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. వారి మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story