KTR : రైతుల ఆత్మహత్యలకు రేవంత్‌ సర్కారే కారణం

అప్పులు తీరే మార్గం కనిపించక ఆవేదన చెంది పురుగుల మందు తాగి ముగ్గురు రైతులు బలవన్మరణం చెందారు. ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు బలికావడానికి ముమ్మాటికీ రైతు వ్యతిరేక రేవంత్ సర్కారే కారణమని బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) విమర్శించారు. ఎక్స్‌లో ఆయన ఈ మేరకు ఓ ట్వీట్(Tweet) చేశారు. 'పొలం ఉన్న రైతులనూ పొట్టుబెట్టుకుంటున్నారు. కౌలు తీసుకున్న కర్షకులనూ కబళిస్తున్నారు ఓవైపు సాగునీటి సంక్షోభం .మరోవైపు రుణమాఫీ ద్రోహం. ఇంకోవైపు రైతుభరోసా మోసం. కౌలు రైతులకూ అందని సాయం. రైతుకు రక్షణ వలయంగా ఉన్న పథకాలనుఒక్కొక్కటిగా ఎగ్గొట్టడంతోనే వ్యవసాయంలో ఈ విలయం. వందలాది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా చలనం లేదు

ముఖ్యమంత్రికి(CM Revanth reddy) సోయి లేదు.. ప్రభుత్వానికి బాధ్యత లేదు..దసరా పండుగ వేళ.. వ్యవసాయాన్ని దండుగలా మార్చిన.. సీఎం రేవంత్ కు రైతన్నల చేతిలో దండన తప్పదు .అన్నదాతలారా ఆత్మస్థయిర్యం కోల్పోకండి..!

ముంచే రోజులు పోతాయ్..!! మళ్లీ మంచిరోజులొస్తాయ్..!!!

జై కిసాన్' అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు

Updated On
Eha Tv

Eha Tv

Next Story