ఏడాదిలోగా కేసీఆర్‌(KCR) ఉనికి లేకుండా చేస్తానన్న రేవంత్‌రెడ్డి(Revanth reddy) వ్యాఖ్యలపై కేటీఆర్‌(KTR) మండిపడ్డారు.

ఏడాదిలోగా కేసీఆర్‌(KCR) ఉనికి లేకుండా చేస్తానన్న రేవంత్‌రెడ్డి(Revanth reddy) వ్యాఖ్యలపై కేటీఆర్‌(KTR) మండిపడ్డారు. ట్విట్టర్‌(Twitter) వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ఒక చరిత్ర అని.. ఆయన పేరు లేకుండా చేసేంత సీన్‌ నీకు లేదన్నారు. ఎక్స్‌లో 'నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోసాడు! నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసాడు! నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు! నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్ కు ఊపిరి పోసాడు! చిట్టినాయుడు! నువ్వా! KCR పేరును తుడిచేది? తెలంగాణ చరిత్ర KCR!' అంటూ ట్వీట్‌ చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story