తెలంగాణ ఆడబిడ్డలకు బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) బతుకమ్మ(Bathukamma) శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ఆడబిడ్డలకు బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) బతుకమ్మ(Bathukamma) శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్‌ వేదికగా ఆయన ఆడపడుచులందరికీ శుభాకాంక్షల సందేశం పంపారు.

'నేటి నుండి తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులందరూ ఎంతో సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రకృతిని ఆరాధిస్తూ.. తీరొక్క పువ్వులను దేవతా స్వరూపంగా భావించి పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి చిహ్నం, అస్తిత్వానికి ప్రతిరూపం మన బతుకమ్మ. సమైక్య పాలనలో ఆదరణకు నోచుకోని మన బతుకమ్మ పండుగ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. ఆటపాటలతో, ఆనందోత్సాహాల మధ్య తెలంగాణ ఆడబిడ్డలందరూ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని కోరుతూ...ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు' అని కేటీఆర్ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story