తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు నాలుగోరోజు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి.

తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు నాలుగోరోజు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌పై(Bdget) అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. సభలో బడ్జెట్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) నేత హరీశ్‌ రావు(Harish rao) చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనసభకు ముందుగా హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. తాము మాట్లాడేటప్పుడు స్క్రీన్లు తిప్పొద్దని కోరారు. తాము అసెంబ్లీలో కనిపించడం లేదని జనాలు మాట్లాడుకుంటున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు. బడ్జెట్‌ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని హరీశ్‌ రావు అన్నారు. రూ.4.5 లక్షల లేని జీఎస్‌డీపీని రూ.14 లక్షలకు తీసుకెళ్లింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు. 1400 మెగావాట్లు రామగుండం నుంచి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించిన హరీశ్ రావు తమ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు కాదని.. ఆధారాలు చూపించాలని రాష్ట్ర ప్రభుతుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ హయాంలో రూ.4,26,499 కోట్లు మాత్రమే చేశామని, లక్షల కోట్లతో తెలంగాణలో సంపద సృష్టించామని హరీష్‌రావు సభలో చెప్పారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story