నేను మంత్రి అయిన రోజు నా కారు ముందు రేవంత్ రెడ్డి(Revanth reddy) డాన్స్ వేశారని హరీష్‌రావు(Harish rao) గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

నేను మంత్రి అయిన రోజు నా కారు ముందు రేవంత్ రెడ్డి(Revanth reddy) డాన్స్ వేశారని హరీష్‌రావు(Harish rao) గట్టి కౌంటర్‌ ఇచ్చారు. రబ్బర్‌ చెప్పులు వేసుకునే రోజుల్లోనే హరీష్‌రావును కాంగ్రెస్(congress) మంత్రిని చేసిందని.. ఆయనకు ఆ విశ్వాశం లేదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు దీటుగా సమాధానం చెప్పారు హరీష్‌రావు. తాను మంత్రి పదవి చేపట్టినప్పుడు నువ్వు మా పార్టీలోనే ఉన్నావని.. నా కారు ముందు డ్యాన్స్‌లు వేశావని రేవంత్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిపదవికి రాజీనామా చేసినపుడు గన్ పార్క్ దగ్గర నా వెనక నిలబడి.. పొట్టిగా ఉంటావు కాబట్టి నిక్కీ నిక్కీ టీవీలో కనపడడానికి చూసినోడివి నువ్వు అని ఎద్దేవా చేశారు. మా టీఆర్ఎస్ పొత్తుతోనే నువ్వు మొదటి సారి ఎమ్మెల్యే అయ్యావు.. మరి నీకు టీఆర్‌ఎస్‌ పార్టీ మీద కృతజ్ఞత ఉందా అని ఎదురు ప్రశ్నించారు. సోనియా గాంధీ బలిదేవత.. వెయ్యి మందిని చంపింది అన్న నీకు అసలు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని రేవంత్‌ను హరీష్ రావు ప్రశ్నించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story