సీఎం రేవంత్‌రెడ్డిపై హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేవారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ

సీఎం రేవంత్‌రెడ్డిపై హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేవారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ..'' కేసీఆర్ లేవనెత్తిన అంశాలను నివృత్తి చేయాలి, లేదంటే సమాధానాలు చెప్పాలి, అది చేయకుండా మరగుజ్జు మనస్తత్వంతో, సంకుచిత మనస్తత్వంతో చిట్ చాట్ పెట్టుకున్నడు. కేసీఆర్‌ది హిమాలయాల ఎత్తు కలిగిన మనస్తత్వం, రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వం. కేసీఆర్ గారు స్టేట్స్ మెన్ గా మాట్లాడితే, రేవంత్ స్ట్రీట్ రౌడీగా మాట్లాడాడు. చీప్ గా మాట్లాడాడు. తెలంగాణకు నొక్కుబడనీయను అంటే ఎందుకు అంత ఆక్రోశం రేవంత్ రెడ్డి. ఫ్రస్టేషన్లో రేవంత్ ఏదో మాట్లాడారు. కేసీఆర్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి ద్రోహిగా నిలబెట్టారు. ఉత్తం గారు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. రెండేళ్లు అయ్యింది పింఛన్లు ఎందుకు పెంచలేదు, 2500 మహాలక్ష్మి ఏమైందని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అడిగారు. నిధులు సేకరించడంలో బాగా అనుభవం ఉందన్నరు, ఇప్పుడు ఏమైంది. వాటాలకు, లూటీలకు, దోపీడీలకు మాత్రమే మీ అనుభవం సరిపోయిందా? రైతులను ఎందుకు గోస పెడుతున్నరు, యాపులు, మ్యాపులు ఏమిటంటే సమాధానం లేదు. ఫార్మాసిటీ ప్రాముఖ్యతను కేసీఆర్ చెప్పారు. సమాధానం చెప్పరు. ఆర్థిక అరాచకత్వం బిఆర్ఎస్ పాలనలో అన్నరు. టోనీ బ్లెయిర్ గారు, సుబ్బారావు తెలంగాణ ప్రగతి గురించి మొన్నటి సమ్మిట్‌లో ఏం చెప్పారు. కొత్త రాష్ట్రం తెలంగాణ అద్బుతమైన అభివృద్ది సాధించింది అన్నరు. అయినా సిగ్గులేకుండా మాట్లాడుతున్నావు. కేసీఆర్ చేసిన అభివృద్ది గురించి నువ్వు ఆహ్వానించిన ప్రతినిధులే చెప్పారు.

రాజకీయాల కోసం ఎందుకు రాష్ట్రం పరువు తీస్తున్నవు రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రగతి ఎందుకు దెబ్బ తీస్తున్నవు. పచ్చ కళ్లద్దాలు పెట్టుకుంటే పచ్చగా కనిపించినట్లు రేవంత్ తీరు ఉంది. సొంత పార్టీ నాయకులనే తొక్కుకుంటూ పెరిగిన అని చెప్పిండు రేవంత్ రెడ్డి, 50కోట్లు పెట్టి పీసీసీ కొన్నడు అని కోమటి రెడ్డి చెప్పిండు. ఎమ్మెల్యేను కొనుగోలు చేసే క్రమంలో 50లక్షలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగవు నువ్వు. నువ్వు నిజాయితీ గురించి మాట్లాడటం సిగ్గు. పుట్టుక ఒక దాంట్లో, సదువు ఒక దాంట్లో, ఉద్యోగం ఒక దాంట్లో రేపు ఎందులో ఉంటవో, చొక్కాలు మార్చినంత సులువుగా పార్టీ మార్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. త్యాగాల చరిత్ర మాది, వెన్నుపోటు చరిత్ర మీది. నీకు మాట్లాడే నైతికత ఉందా రేవంత్ రెడ్డి

ఊసరవెల్లి కూడా నిన్ను చూస్తే సిగ్గుపడుతుంది. సోనియాను దేవత అంటవు, బలి దేవత అంటవు. నీకో స్టాండ్, సిద్దాంతం ఉందా రేవంత్ రెడ్డి

2022-23లో 258 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలో తెలంగాణను నెంబర్ 1గా చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం. ధాన్యం సేకరణలో 2020-21లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రికార్డు నెలకొల్పినం. మల్లన్నసాగర్, రంగనాయక్ సాగర్, అనంతగిరి కింద పండ పంటల కాళేశ్వరం కాదా? వర్షాలు బాగా ఉంటే ఎస్సారెస్పీ నుంచి, మధ్య పరిస్థితులు ఉంటే ఎల్లంపల్లి నుంచి, కరువు పరిస్థితులు వస్తే మేడిగడ్డ నుంచి కాళేశ్వరం నీళ్లు వాడుతం. నువ్వు రాకముందే ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ ఏంది.

రెండేళ్లు అయినా ఉత్తం ప్రెస్ మీట్లకు ప్రిపేర్ కాకుండా రావడం సిగ్గుచేటు. సగం సగం చదివి, సగం సగం చెబుతడు. 2023లో డీపీఆర్ వాపస్ వస్తే కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (CEA) అనుమతి, సెంట్రల్ సాయిల్ & మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్(CSMRS) అనుమతి, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ (MoTA) అనుమతి, కేంద్ర భూగర్భ జల బోర్డు (CGWB) అనుమతి ఎట్ల సాధించినం. పాలమూరు డీపీఆర్ 12.04.2023 లో వాపస్ వస్తే, మూడు రోజుల్లోనే మా ప్రభుత్వం జల్ శక్తి మినిస్ట్రీ కి లేఖ రాసింది. కేసీఆర్ జల్ శక్తి అధికారులతో మాట్లాడారు. అక్కడ నుంచి cwc కి అప్రైసల్ కొనసాగించమని ఆదేశాలు ఇప్పించినం. EAC సిఫారసు సహా 7 అనుమతులు సాధించినం. ఇది వాస్తవం కాదా?

19.12.2024 లో DPR వాపస్ లేఖ రాస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు. ఇదే కదా కేసీఆర్ నిన్న మిమ్మల్ని నిలదీసింది. రెండేళ్లలో ఒక్క అనుమతి కూడా ఎందుకు తేలేదు. ఇది కాకుండా 45 టీఎంసీలు చాలు అంటూ ఢిల్లీకి రాసిండు ఉత్తం కుమార్, సీఎం. సిగ్గులేకుండా మేం రాయలేదు అంటున్నారు. డీపీఆర్ వాపస్ తెస్తవు, 45 టీఎంసీలు చాలు అంటవు. 45 టీఎంసీలతో ఎవరికి అన్యాయం చేస్తవు, పాలమూరుకా, రంగారెడ్డికా, నల్లగొండగా. ఎవరి డైరెక్షన్.. చంద్రబాబు డైరెక్షనా? దానికి సమాధానం చెప్పకుండా చిల్లర వాగుడు ఎందుకు 45టీఎంసీలు చాలు అని నువ్వు లెటర్ రాసావు. సిగ్గులేకుండా మాట్లాడుతున్నావు'' అంటూ ఉత్తంపై కూడా హరీష్‌రావు మండిపడ్డారు.

Updated On
ehatv

ehatv

Next Story