జనవరి నుంచి బీఆర్‌ఎస్(BRS) పోరుబాట పట్టనుందా..?

ఓ వైపు కేటీఆర్‌ పాదయాత్ర చేయడం ఖరారు కావడంతో.. కేసీఆర్‌ కూడా బస్సుయాత్ర(KCR Bus TOur) చేపట్టనున్నారని తెలిసింది. బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు కేసీఆర్‌ సిద్ధమైనట్లు సమాచారం. ఉద్యమ పార్టీని రాజకీయపార్టీగా మల్చిప్రజల అభిమానం గెలుచుకుని రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన కేసీఆర్‌.. తిరిగి పార్టీని బలోపేతం చేయడం కోసం తాను కూడా బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఓ వైపు కేటీఆర్ పాదయాత్ర, మరోవైపు కేసీఆర్ బస్సు యాత్ర ఉండడంతో పార్టీలో ముఖ్యనేతగా ఉన్న హరీష్‌రావు(Harish Rao) పాత్ర ఎలా ఉండబోతుందని ఆసక్తిగా మారింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story