ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy) గురువారం హైడ్రాపై(Hydra) చాలా ఆవేశంగా మాట్లాడారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy) గురువారం హైడ్రాపై(Hydra) చాలా ఆవేశంగా మాట్లాడారు. సబితా ఇంద్రారెడ్డి(Sabitha indra reddy), కేవీపీ(KVP), కేటీఆర్‌ ఫామ్‌ హౌజ్‌లను(KTR Farm house) కూల్చేస్తామని గట్టిగా చెప్పారు. దీనిపై సబితా ఇంద్రారెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. మా అబ్బాయి కడుతున్న 'ఇల్లు' మినాయించి, మిగతా మూడు 'ఫామ్ హౌస్ లు' ఎక్కడున్నాయి అనే వివరాలు ప్రజల ముందు పెట్టండి. మీరు ఎన్ని రకాలుగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటానని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఆత్మ అభిమానం కన్నా మించిన ఆస్తి లేదని నమ్ముతున్న వ్యక్తిని నేను. మీ ముందు కానీ మరి ఇంకెవరు ముందులో కానీ 'పేద ఏడుపులు' ఏడ్చిన సందర్భం నాకు ఆ దేవుడు కలిగియలేదు. మిమ్మల్ని, మీ మాట తీరుని ఈ తెలంగాణ సమాజం గమనిస్తుంది, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని చెప్పుకొచ్చారు సబితా ఇంద్రారెడ్డి!

Updated On
Eha Tv

Eha Tv

Next Story