హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు(Hyderabad Jubilee Check Post) దగ్గర అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది.

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు(Hyderabad Jubilee Check Post) దగ్గర అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. పీకల్దాక మందు తాగిన విద్యార్థులు కారు డ్రైవ్‌ చేసి ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. . బీటెక్‌ విద్యార్థి సాకేత్‌ రెడ్డి(saketh Reddy) తన మిత్రుడితో కలిసి మంగళవారం అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. అనంతరం, కారు డ్రైవ్‌ చేస్తూ జాబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు దగ్గరకు వచ్చారు. వారిద్దరూ మద్యం మత్తులో ఉండటంతో కారు కృష్ణానగర్‌(Krishna Nagar)వైపు వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో కారు అదుపు తప్పింది. కారు అతివేగంతో ఫుట్‌పాత్‌పైకి ఎక్కి.. టెలిఫోన్‌ స్థంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదాన్ని గమినించిన స్థానికులు కారులో ఇరుక్కుపోయిన విద్యార్థులను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో సాకేత్‌ రెడ్డి, కారులో ఉన్న అతడి స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు.

Updated On
ehatv

ehatv

Next Story