Cast Sensus: బీసీల కులగణనలో దేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ: పొంగులేటి

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం నాడు మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో ఈ నెల 15 తేదీన కామారెడ్డి లో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి దాసరి అనసూయ సీతక్క, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, శాసనసభ్యులు మదన్ మోహన్ రావు తదితరులతో కలిసి సమీక్షించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అందుకే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను బీసిల కోసం కృషి చేస్తుంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అడ్డుకుంటుందని సమావేశంలో మంత్రులు అభిప్రాయపడ్డారు. కామారెడ్డి వేదికగా ఇచ్చిన బీసీ కులగణన హామీని సీఎం రేవంత్ రెడ్డి పిసిసి నేత మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో సాధించాం. ఈనెల 15న కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభ చాలా ప్రతిష్టాత్మకమైందని ఈ సభను విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో చర్చించారు.

ehatv

ehatv

Next Story