కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై విచారణను సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో అంతర్‌రాష్ట్ర అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలుపంచుకున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్‌లో వ్యాప్కోస్‌ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాలుపంచుకున్నందున సీబీఐకి విచారణ అప్పగించడం సముచితమని తమ ప్రభుత్వం భావిస్తుందన్నారు.

కేటీఆర్‌ విమర్శలు..!

''తెలంగాణలో రాహుల్ గాంధీ కరెన్సీ మేనేజర్ (CM) కాళేశ్వరం కేసును CBIకి అప్పగించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

బిజెపి యొక్క "ప్రతిపక్ష ఎలిమినేషన్ సెల్" అని ప్రముఖంగా పిలిచిన అదే CBI. మిస్టర్ గాంధీ మీ ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నారో మీకు ఏమైనా తెలుసా? మీకు చెప్పండి, మీరు మాపై కుట్ర పన్నినా, మేము చట్టపరంగా, రాజకీయంగా పోరాడుతాము. న్యాయవ్యవస్థ మరియు ప్రజలపై మాకు నమ్మకం ఉంది. సత్యమేవ జయతే'' అంటూ ఆయన కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

ehatv

ehatv

Next Story