KCR హయాంలోనే చనాక కొరాట బరాజ్, సదర్‌మాట్‌ బరాజ్‌: KTR

కేసీఆర్ హయాంలో ప్రారంభమై, 90% పైగా పనులు పూర్తిచేసుకున్న రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవ్వాళ ప్రారంభం కావడం సంతోషదాయకంమని కేటీఆర్‌ అన్నారు.

చనాక కొరాట బరాజ్: 0.98 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో నిర్మించిన ఈ బరాజ్ బీఆర్ఎస్ హయాంలోనే 95% పనులు పూర్తయ్యి, సెప్టెంబర్ 2023లో ట్రయల్ రన్ కూడా అయ్యింది. దీనిలో భాగమైన లిఫ్ట్ ఇరిగేషన్ కాంపొనెంట్‌తో కలిపి, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గల్లోని 89 గ్రామాలకు చెందిన సుమారు 51,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. 2016లో మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకుని మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇదని అన్నారు KTR

సదర్‌మాట్ బరాజ్: దీని నీటి నిల్వ సార్ధ్యం 1.58 టీఎంసీలు, కేసీఆర్ హయాంలోనే 90% ప్రాజెక్టు పూర్తయ్యింది, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని 18,000 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తుంది. కేసీఆర్ పాలనలో #తెలంగాణదశాబ్ది (2014-2023), నెర్రెలుబారిన ఈ నేలను దేశానికి ధాన్యాగారంగా మార్చిందని, జై తెలంగాణ ఎక్స్‌వేదికగా పోస్ట్ చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story