ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వెళ్ల‌నున్నారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మధ్యాహ్నం మహబూబ్ నగర్ IDOC వద్ద సీఎం మొక్కలు నాటనున్నారు. మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించి.. వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం భూత్‌పూర్ రోడ్‌లోని ASN కన్వెన్షన్ హాల్‌లో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశంలో సీఎం పాల్గొంటారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story