భద్రాచలం ఆలయ ప్రధానార్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులు(Podicheti Seetharamanujacharyulu)కు కుమార్తెలు ఉండడంతో

భద్రాచలం ఆలయ ప్రధానార్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులు(Podicheti Seetharamanujacharyulu)కు కుమార్తెలు ఉండడంతో.. వెంకట సీతారాం(Venkata Seetharam)ను కొన్నేళ్ల కిందట దత్తత తీసుకొని భద్రాచలం(Bhadrachalam)ఆలయ అర్చకుడిగా ఉద్యోగం ఇప్పించాడు. వెంకట సీతారాంకు తాడేపల్లిగూడెం(Tadepalligudem)కు చెందిన యువతితో 2019లో పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన కొన్ని నెలలకే సీతారాం భార్యకు వరకట్నం తేవాలని వేధింపులు మొదలయ్యాయి. అలాగే ఆమె పై మామ సీతారామానుజాచార్యులు కన్నేశాడు.. తనకు కుమారులు లేరని, తన పోలికలతో ఒక బాబు కావాలని కోడలిపై, సీతారామానుజాచార్యులు లైంగిక దాడి చేశాడు. ఈ విషయం ఆమె తన భర్తకు చెప్పగా, అతను తిట్టి సీతారామానుజాచార్యులు అలాంటి వాడు కాదని, భార్యతోనే తండ్రికి క్షమాపణ చెప్పించాడు. దీంతో బాధితురాలు ఆగస్టులో తాడేపల్లిగూడెం పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టగా.. తండ్రీకొడుకులను దేవాదాయశాఖ అధికారులు సస్పెండ్ చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story