సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం వెనుక కుట్ర ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ సందేహపడుతున్నారు.

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం వెనుక కుట్ర ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ సందేహపడుతున్నారు. మరణం వెనుక బీజేపీ కుట్ర ఉందంటూ బాంబు పేల్చారు. చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరకుండా ఉండాల్సిందన్నారు. ఎయిమ్స్‌లో ఏచూరికి సరైన వైద్యం లభించలేదని ఆరోపించారు. పక్క బెడ్‌లోనే స్వైన్‌ ఫ్లూ రోగిని ఎలా ఉంచుతారని చింతా మోహన్‌ ప్రశ్నించారు. ఈ కారణంగా ఏచూరి ఆరోగ్యం మరింత క్షీణించిందన్నారు. ఏచూరికి మెరుగైన వైద్యం అందించకుండా బీజేపీ కుట్ర చేసిందని చింతా మోహన్‌ ఆరోపించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story