రాజీవ్ యువ వికాసం పథకం అనేది తెలంగాణ ప్రభుత్వం 2025లో ప్రవేశపెట్టిన ఒక ప్రతిష్టాత్మక స్వయం ఉపాధి పథకం.

రాజీవ్ యువ వికాసం పథకం అనేది తెలంగాణ ప్రభుత్వం 2025లో ప్రవేశపెట్టిన ఒక ప్రతిష్టాత్మక స్వయం ఉపాధి పథకం. ఈ పథకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాల నిరుద్యోగ యువతకు వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కింద రూ. 6,000 కోట్ల బడ్జెట్‌తో 5 లక్షల మంది యువతకు ఆర్థిక సహాయం అందించనున్నారు. గరిష్టంగా రూ. 3 లక్షల వరకు రాయితీ రుణాలు కొంత భాగం బ్యాంకు రుణం, కొంత సబ్సిడీ. రూ. 50,000 లోపు యూనిట్లకు 100% సబ్సిడీ. రూ. 50,001 - రూ. 1 లక్ష మధ్య యూనిట్లకు 90% సబ్సిడీ, 10% బ్యాంకు రుణం. రూ. 1,00,001 - రూ. 2 లక్షల మధ్య 80% సబ్సిడీ, 20% బ్యాంకు రుణం. రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షలల వరకు 70% సబ్సిడీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల నిరుద్యోగ యువతకు ఇది అందించనున్నారు. వ్యవసాయ అనుబంధ యూనిట్లకు 21-60 ఏళ్లు, ఇతర యూనిట్లకు 21-55 ఏళ్లు. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.5 లక్షలు, పట్టణాల్లో రూ. 2 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులు. మకొందరు ఈ పథకాన్ని కాంగ్రెస్ (Congress)కార్యకర్తల కోసం రూపొందించినట్లు ఆరోపిస్తున్నారు. సిబిల్ స్కోర్(CIBIL score) ఉంటేనే రాజీవ్ యువ వికాసం పథకానికి(rajiv yuva vikasam scheme) అర్హులని తేల్చింది. గతంలో ఏవైనా లోన్లు తీసుకుని కట్టనివారి అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దరఖాస్తుదారుల లోన్ హిస్టరీ, సిబిల్ స్కోర్ వివరాలను బ్యాంకుల నుంచి సేకరించేందుకు చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం. దీంతో 40% అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
