స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. సీఎం రేవంత్ శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. ఆ శాఖ మంత్రి సీతక్క, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, కమిషనర్ సృజనలు ఈ మీటింగ్‌లో పాల్గొనన్నారు. స్థానిక ఎన్నికలను ఈనెల 30లోగా నిర్వహించాలని హైకోర్టు గడువు విధించిన నేపథ్యంలో మరింత టైం ఇవ్వాలని ప్రభుత్వం కోరనున్నట్టు సమాచారం. ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం పైనా ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తున్నది. ఈరోజుతో స్థానిక ఎన్నికలపై స్పష్టత రానుంది. బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం తర్వాత రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. దీంతో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల జీవో జారీపైనా ఈరోజు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికారులు రిజర్వేషన్ల జాబితాను సిద్ధం చేశారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు జీవో ఇవ్వగానే జిల్లా అధికారులు రిజర్వేషన్ల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు.
